దారుణం..ఢిల్లీ మహిళపై అత్యాచారం

0
86

ఇప్పటికే దేశంలో ఎన్నో అత్యాచార ఘటనలు చోటుచేసుకుని మహిళల జీవితాలు అంధకార మయం కాగా..తాజాగా హైదారాబాద్ లో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మోహన్ గుప్త అనే యువకుడు ఫార్మా వ్యాపారం చేస్తూ సోషల్ మీడియాలో ఢిల్లీకి చెందిన ఓ మహిళకు పరిచయమయ్యాడు.

ఆ పరిచయంతో ఆ మహిళకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అనంతరం ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా నిందితుడు బంజరాహిల్స్ లోని తన ఇంటినుండి పారిపోయినట్లు తెలుస్తుంది. దీనితో బాధితురాలు  ద్వారక పోలీసుస్టేషన్ పోలీసులను ఆశ్రయిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.