Flash: దారుణం..ఒకే మహిళపై ఐదుగురు కామాంధులు లైంగిక దాడి

0
106

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.  ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర దారుణం చోటు చేసుకుంది.

షాజహాన్‌ పూర్‌లో ఓ మహిళను ఐదుగురు కామాంధులు ఇంటిలోపలికి లాక్కెళ్లి ఆమెను వరుసగా ఒక్కొక్కరూ లైంగిక దాడి చేసారు. అనంతరం వీడియో తీసి ఘటన స్థలం నుండి పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితురాలు వీడియో వైరల్ చేస్తామని బెదిరించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నిందితులు వీడియో వైరల్ చేయడంతో బాధితురాలైన యువతీ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.