మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలో ఘోర దారుణం చోటు చేసుకుంది.
స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న14 ఏళ్ల బాలికను కొందరు కామాంధులు అడ్డగించి కిడ్నాప్ చేసి అధికంగా చెట్లు ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి ఒక్కొక్కరుగా బాలికపై అత్యాచారం చేసి ఘటన స్థలం నుండి పరారయ్యారు.దాంతో బాలిక స్పృహ కోల్పోవడంతో అక్కడే కొంతసేపు ఉండిపోయింది.
ఆ తరువాత బాలికకు స్పృహ వచ్చి ఇంటికి వెళ్ళి జరిగిన ఘటనను తల్లితండ్రులకు వివరించడంతో పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంకా మిగతా వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు