Flash: ఏపీలో దారుణం.. పట్టపగలే వివాహితపై హత్యాచారం

0
96

ఏపీలో ఘోర దారుణం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ అనే వివాహితపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసిన విషాద ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో చోటుచేసుకుంది.

తిరుపతమ్మకు శ్రీనివాసరావు అనే వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహం కావడంతో పాటు..కూతురు, కొడుకు కూడా ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో పడి వున్న మృతదేహాన్ని చూసిన తిరుపతమ్మ బంధువుడు పోలీసులు చెప్పడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతదేహంపై ఉన్న గాయాలతో పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని అతని భర్త చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేరుస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.