Flash: ఏపీలో దారుణం..రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

0
80

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడ సమీపంలోని జగ్గయ్య చెరువుకు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ఎస్సైగా ఎంపికై కాకినాడలో ట్రాఫిక్ విభాగంలో గత కొంతకాలంగా న్యాయంగా పని చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలు పిల్లలను పోషించుకుంటూ నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్సై ఆత్మహత్య చేసుకొని మృతిచెందడంతో కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది.

ఈ రోజు తెల్లవారుజామన గోపాలకృష్ణ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు చేసుకున్న ఘటన ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తుపాకీ మిస్‌ఫైర్ జరగడం వల్ల లేదా వ్యక్తిగత కారణాల వల్ల మృతి చెందాడా అని పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఈ ఆత్యహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.