ఫ్లాష్: ఏపీలో దారుణం..ఇడ్లీ తినలేదనీ బిచ్చగాడిని హత్య

0
84

ఈ మధ్యకాలంలో చిన్నచిన్న కారణాలకు ఎదుటివారి ప్రాణాలను బలితీసుకోవడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ఇప్పటికే ఇలాంటి హత్యలు వల్ల ఎంతో మంది ప్రణాలు కోల్పోగా..తాజాగా ఏపీలో ఇడ్లీ తినలేదన్న కోపంతో బిచ్చగాడిని మానవత్వం లేని ముగ్గురు కామాంధులు హత్య చేసారు. వివరాల్లోకి వెళ్ళితే..గుంటూరు అర్బన్ జిల్లాలోని అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో ఓ బిచ్చగాడిని మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు హత్య చేసిన ఘటన అందరి మనసులను కలచి వేస్తుంది.

మగ్గురు యువకులు బిక్షాటన చేసుకునే ముసలాయనను వికచక్షణ రహితంగా తిట్టారు. అనంతరం ఇడ్లీ ఇచ్చి తినమనడంతో బాదపడ్డ యాచకుడు తినునకుండా పారేసాడు. దాంతో కోపం తెచ్చుకున్న యువకులు బిక్షం అడుక్కునే ముసలాయనపై తీవ్రంగా మండిపడి ముగ్గురు వ్యక్తులు దారుణంగా  కొట్టి హత్య చేసారు. అంతేకాకుండా బిచ్చగాడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకెళ్లి..అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డులోకి తీసుకెళ్లి ముగ్గరు..దారుణంగా బిచ్చగాడిపై దాడి చేశారు.

ఆ దెబ్బలను తట్టుకోలేక ముసలాయన అక్కడిక్కడే మరణించాడు. దాంతో నిందితులు బయపడి ఘటన స్థలం నుండి పరారయ్యారు. అనంతరం ఈ కేసుపై డీఎస్పీ జెస్సీ ప్రశాంతి గాలింపు చర్యలు చేపట్టి నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులను కోర్టులో కూడా  హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.