ఏపీలో దారుణం..అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో వ్యక్తిని హత్య..

0
116

ప్రస్తుతం కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో వ్యక్తిని కత్తితో నరికిన ఘటన అందరిని భయభ్రాంతులను చేస్తుంది.

వివరాల్లోకి వెళితే..క‌ర్నూల్ జిల్లాలో ఎమ్మిగనూరు మండలం చెన్నాపురంకు చెందిన రాఘవేంద్ర  అనే యువకుడు తాగుడుకు బానిసై ఓ వివాహితతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. అది కాస్త వివాహేత‌ర సంబంధానికి దారితీసి తీసిన విషయం ఆమె భర్తకు తెలియడంతో ఆ ఊరిలో ఒకరి సహకారంతో అతనిని చంపాలని పాకట్బందిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

అనుకున్న విధంగానే అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు కలసి రాఘవేంద్రను వేటకొడవలితో నరికి చంపేసి ఘటనాస్థలం నుండి పరారయ్యారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనకు గల వివరాలను తెలుసుకొని ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.