Flash: ఏపీలో దారుణం..అర్ధరాత్రి మహిళపై అత్యాచారం

0
75

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం  అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర దారుణం చోటు చేసుకుంది.

విజయనగరం జిల్లాలోని  ఉడా కాలనీలోని  అర్ధరాత్రి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో కొందరు యువకులు తలుపులు కొట్టారు. మహిళ తలుపులు తీయడంతో బలవంతంగా లోనికి చొరబడి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధిత మహిళా కన్నీటీ పర్యంతం అయ్యింది.

ఉపాధి కోసం ఆ గ్రామానికి వచ్చి టీ దుకాణంలో పని చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని పట్టుకొని దర్యాప్తు చేయగా..దుండగుడు బాధితురాలికి పరిచయస్తుడేనని విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్ వెల్లడించారు.