ఏపీలో దారుణం..బిడ్డకు తన పోలికలు లేవని తండ్రి ఘాతుకం

Atrocities in AP..the father who has no similarities is a murderer

0
93

కన్న తండ్రే తన పాలిట కాలయముడవుతాడని ఆ 2 నెలల పాప పసిగట్టలేకపోయింది. తండ్రి కిరాతకాన్ని ఏ మాత్రం గుర్తించలేని వయస్సులో ఉన్న ఆ చిన్నారి తండ్రి ఎత్తుకోగానే సంతోషంతో చిరునవ్వు నవ్వింది. పాపం అవే తన చివరి గడియలని ఆ చిన్నారి ఊహించలేకపోయింది. తన పోలికలతో పుట్టలేదనే కోపంతో ఆ కసాయి తండ్రి అతికిరాతకంగా ఆ పాపను చంపి చెరువులో వేశాడు. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

కల్యాణదుర్గంకు చెందిన మల్లికార్జున దంపతులకు రెండు నెలల క్రితం ఓ పాప జన్మించింది. అయితే ఆ చిన్నారి తన పోలికలతో జన్మించలేదనే కోపంతో రగిలిపోయాడు ఆ తండ్రి. ఎలాగైన చిన్నారిని చంపాలని అనుకొని నిన్న పాపను తీసుకుని బయటకు వెళ్లిన మల్లికార్జున ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చిన్నారి తల్లి తల్లడిల్లిపోయింది. పాపం ఏం చేయాలో తెలియక ఆ తల్లి బిడ్డ అదృశ్యం అయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పాప కోసం నిన్నటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ చెరువులో శవమై కనిపించింది. ఇంతలో బెంగళూరు నుంచి పోలీసులకు ఫోన్‌ చేసిన మల్లికార్జున తానే చంపి చెరువులో పడేశానని తెలిపాడు. పాపను చంపి బెంగళూరుకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. పోలీసులు చెరువు నుంచి పాప మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.