Flash: ఏపీలో దారుణం..మహిళపై ముగ్గురు గ్యాంగ్ రేప్..

0
86

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర దారుణం చోటుచేసుకుంది.

బ్రతుకుతెరువు కోసం ఇద్దరు దంపతులు అవనిగడ్డ వెల్దామని నిర్ణయించుకొని వెళ్లడంతో అక్కడ బస్సులు దొరకకపోవడంతో  నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా..ముగ్గురు  కామాంధులు మహిళపై గ్యాంగ్ రేప్ చేసారు. ఈ క్రమంలో భర్త ఆపే ప్రయత్నం చేయడంతో తీవ్రంగా గాయపరిచారు.

వీరివురు  ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. అనంతరం సమాచారం తెలుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దంపతుల వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.