Flash: ఏపీలో దారుణం..మహిళపై దుండగులు గ్యాంగ్ రేప్

0
89

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర దారుణం చోటు చేసుకుంది.

శ్రీ సత్యసాయి జిల్లాలోని కనగానపల్లి మండలానికి చెందిన వివాహితను కొందరు కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత బండరాయితో తలపై దారుణంగా హత్య చేసిన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లై ఓ బాబు కూడా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

తను బయటకు వెళ్ళి ఇంటికి ఇంకా తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో గాలిస్తుండగా..ఊరిబయట మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు చేసుకున్నారు.  దీంతో ఈ హత్యపై కొందరిపై అనుమానముందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.  దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.