Flash: ఏపీలో దారుణం..మహిళపై అత్యాచారయత్ననికి పాల్పడిన దుండగులు

0
105

ఏపీలో వరుస దారుణాలతో మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. నిన్న పట్టపగలే వివాహితపై హత్యాచారం చేసిన ఘటన మరవకముందే మరో ఘోర దారుణం చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఓ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించినా విషాద ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో చోటుచేసుకుంది.

దుగ్గిరాల గ్రామానికి ఓ మహిళ కూలి పనికి వచ్చి పక్కనే ఉన్న ఆలయంలో నిద్రిస్తుండగా..కొందరు దుండగులు పంట పొలాల్లోకి బలవంతంగా లాకెళ్లి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళా ఒక్కసారిగా గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకునేవరకు దుండగులు పారిపోయారు.

అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.