ఏపీలో దారుణం..భర్త మర్మాంగంపై వేడి నీళ్లు పోసిన భార్య

Atrocities in AP..wife pouring hot water on husband's mystery

0
96

ఒకప్పుడు దాంపత్య బంధాలు వేరు. ఇప్పుడు వేరు. అప్పుడు ఒకరు అంటే ఒకరికి రెస్పెక్ట్ ఉండేది. ఎలా ముందుకు వెళ్లాలి. పిల్లలకు ఎలాంటి చదవులు చెప్పించాలి. వారి జీవితాలకు ఎలాంటి బాటలు వేయాలి. ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలి అని భార్యభర్తలు చాలా రకాలుగా ప్లాన్ చేసుకుని ముందకు వెళ్లేవారు.

కానీ ఇప్పుడు బంధాలు దారంలా డెలికేట్ అయిపోయాయి. చిన్న చిన్న వాటికే విడాకులు. ప్రాణాలు తీసుకోవడాలు, తీయడాలు, వివాహేతర సంబంధాలు ఇది ఇప్పుడు నడుస్తోన్న ట్రెండ్. ఇక తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడాల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై భార్య ఏకంగా సలసల మరిగే వేడి నీళ్లు పోసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అక్టోబర్ 15న అర్ధరాత్రి చోటు చేసుకుంది.
అంతకుముందు భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం .

ఆ తర్వాత నిద్రిస్తున్న భర్తపై భార్య సల సలా కాగే వేడి నీళ్లు పోసినట్లు తెలిసింది. వేడి నీళ్లు మర్మాంగంపై పోయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ సీఐ ఆది ప్రసాద్ ,ఎస్సై కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు ఏలూరు పత్తే బాధ సెంటర్లో టైలర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.