ఫ్లాష్: ఏపీలో దారుణం..ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య..

0
131

ఏపీలో దారుణ హత్య చోటు చేసుకుంది. మెరకముడిదాం గ్రామానికి చెందిన అట్టాడ చంద్రశేఖర్ అనే యువకుడికి 16 ఏళ్ల క్రితం అరుణ జ్యోతి అనే యువతితో  పెళ్లి జరగగా..వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. వీరందరూ కలసి కె.రాంబాబు అనే యువకుడి ఇంట్లో అద్దెకు ఉండడంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

కొంతకాలం తర్వాత చంద్రశేఖర్‌ భార్యతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో రాంబాబు రోజు అరుణ జ్యోతి కలవడం గమనించిన ఆమె భర్త ప్రియుడితో తిరగడం ఆపాలని నచ్చజెప్పాడు. వినకుండా భర్తపై కక్ష పెంచుకొని పక్క ప్లాన్ వేసుకొని  రాంబాబు, అరుణ జ్యోతి కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. చంద్రశేఖర్‌ తలపై రాంబాబు స్నేహితుడు వెనుక నుంచి రాడ్డుతో గట్టిగా కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అనుమానంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేయడంతో అసలు నిజం తెలిసింది. ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఈ దారుణం వెలుగుచూసింది.