ఏపీలో దారుణం..యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

0
99

రోజురోజుకు దేశంలో క్రైమ్ పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. భూ తగాదాలు, ప్రేమించలేదని, ఇతర కారణాలతో హత్యలకు పాల్పడుతున్నారు దుర్మార్గులు. తాజాగా ఏపీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించమని అమ్మాయిని విచక్షణారహితంగా కత్తితో గొంతు కోశాడు.

వివరాల్లోకి వెళితే..నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని చెంచు కృష్ణ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. తరచూ ఆమె కాలేజ్ దగ్గరికి వెళ్లి.. ప్రేమించమని వేధించే వాడు. అయినప్పటికీ జ్యోతిక నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు.

దాన్ని మనసులో పెట్టుకున్న కృష్ణ ఈరోజు ఇంటిలోకి జోరబడి నిద్రిస్తున్న జ్యోతిని చాకుతో గొంతు కోశాడు.  తనకేం తెలియదు అన్నట్టుగా వెళ్లి కల్లు తాగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ప్రస్తుతం జ్యోతిక… నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.  ప్రస్తుతం చెంచు కృష్ణ పోలీసులు అదుపులో ఉన్నాడు.