హైదరాబాద్ లోని హయత్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కొందరు దుండగులు కిరాతంగా హత్య చేసి నడిరోడ్డుపై కారులో శవాన్ని వదిలేసి వెళ్లారు. ఆ కారును చూసిన వారందరు పార్కింగ్ చేసి ఉందని భావించారు. కానీ ఆ కారు దగ్గరి నుంచి వెళ్లిన వాళ్లు వెనుక సీట్లో ఏదో ఉండటాన్ని గమనించారు. పరిశీలించి చూస్తే అందులో ఓ శవం కనిపించింది. దీనితో అందరూ భయాందోళనకు గురయ్యారు.
వ్యక్తిపై కారం చల్లి ఉండడం రక్తపు మరకలు ఉండడంతో హత్యగా అనుమానించారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నంబర్ సగం విరిగి ఉండడంతో వివరాలు తెలియలేదు. పోలీసులు కేసును విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.