Flash- హైదరాబాద్ లో దారుణం..భార్యకు యాసిడ్‌ తాగించిన భర్త..ఆపై నగ్నంగా

0
100

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి కసాయిగా ప్రవర్తించాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే…ఆస్తుల కోసం సొంత భార్యను అంతమొందించటానికి కుట్ర చేశాడు సైదాబాద్‌ కు చెందిన ఇంజనీర్‌ అధికారి. భార్యకు యాసిడ్ తాపించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాదు విషయం బయటకి పొక్కకుండా నగ్నంగా గదిలో బంధించాడు ఆ నీచుడు. అయితే..తన భర్త నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన బాధితురాలు.. నేరుగా సైదాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు ఆమె భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.