హైదరాబాద్‌లో దారుణం..నెల రోజులుగా యువతిపై సామూహిక అత్యాచారం

Atrocities in Hyderabad .. Mass rape on a young woman for a month

0
82

తెలంగాణ: హైదరాబాద్ గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నగ్న చిత్రాలతో బెదిరింపులకు దిగుతూ..ఓ మహిళపై‌ ముగ్గురు వ్యక్తులు నెల రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహిళ కాళ్లు, చేతులు బంధించి తనపై అత్యాచారం చేశారని, అపై తన నగ్న, అశ్లీల చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ మహిళ తెలిపింది.

నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరికైనా జరిగిన విషయం చెప్తే చంపుతానని బెదిరించడంతో ఎవరికి చెప్పలేక పోయానని బాధిత మహిళ తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.