Flash: హైదరాబాద్ లో దారుణం..బాలుడిని కత్తితో పొడిచి రక్తం కారుతుండగానే సెల్ఫీ

0
107

ప్రస్తుతంకాలంలో కేవలం పెద్దలే కాకుండా..విద్యార్థులు సైతం హత్యలు చేయడానికి వెనుకాడడం లేరు. హైదరాబాద్ లో ఓ విద్యార్థి చేసిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల మధ్య ప్రేమ ప్రేమ వ్యవహారం కారణంగా చిన్న గొడవ కాస్త పెద్దగా మారడంతో బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు వారి స్నేహితులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే..మంగళవారం రోహన్‌, అతని స్నేహితులు ఫిల్మ్‌నగర్‌లో చింటూను బైక్‌ ఎక్కించుకొని రాజేంద్రనగర్‌లోని మూసీనది వద్దకు తీసుకెళ్లారు. ఆ తరువాత చింటూ అనే విద్యార్థిని రోహన్‌ అనే మరో విద్యార్థి కత్తితో దాడి చేసిన అనంతరం రక్తం కారుతుండగానే రోహన్‌ సెల్ఫీ దిగి ఘటన స్థలం నుండి పరాయ్యాడు. అనంతరం సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.