నిజామాబాద్ లో దారుణం..ఇద్దరు బాలికలపై అత్యాచారం

0
86

కామాంధుల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఒక ఘటన మరువకముందే మరొకటి వెలుగు చూస్తూనే ఉంది. నిత్యం ఎక్కడో ఒకచోట కామాంధుల దాటికి మగువలే కాదు..ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా బలవుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా..కీచకులు విచక్షణారహితంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. చాక్లెట్​ ఆశ చూపి ఇద్దరు బాలికలపై ఓ నీచుడు అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఆలస్యంగా బయటకు వచ్చింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా..ఇంకెన్ని చట్టాలొచ్చినా అవేవీ కామాంధుల అకృత్యాలకు కళ్లెం వేయలేకపోతున్నాయి. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్​ ఆశ చూపి అత్యాచారం చేసిన ఘటన మరవకముందే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం కలకలం రేపుతోంది.