తెలంగాణాలో దారుణ హత్య కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా, దామరచర్ల మండల కేంద్రంలో గుర్తుతెలియని దుండగులు కుర్రా లింగరాజు అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.