ఆడవారిపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అరాచకాలను ఆపలేకపోతున్నారు. తాజాగా..రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మహిళపై కొందరు కీచకులు సామూహిక అత్యాచారం చేశారు. మద్యం మత్తులో ఉన్న తనను ఆటోలో తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అత్యాచారం చేసిన అనంతరం మెడలోని పుస్తెలతాడు..తన వద్ద ఉన్న నగదు దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.