తెలంగాణలో దారుణం..మైనర్ బాలికపై అత్యాచారం

0
113

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. మానవ రూపంలో ఉన్న మృగాల ఆగడాలకు అమాయక చిన్నారులు బలవుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది.

నిజామాబాద్ నగరానికి చెందిన ఓ మైనర్ బాలిక(17) గత నెల 31న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. 14 రోజుల పాటు చికిత్స పొందిన ఆ బాలిక ఇటీవలే కోలుకుంది. కోలుకున్న తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది.

తాను ప్రేమించిన అబ్బాయి తనని మోసం చేశాడని.. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.