తెలంగాణలో దారుణం..అన్న గొంతు కోసిన తమ్ముడు..!

Atrocities in Telangana .. that choked younger brother ..!

0
82

తెలంగాణ: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దీపూర్‌లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ కాస్తా..ప్రాణాల మీదకు తెచ్చింది. బర్దీపూర్‌కి చెందిన షేక్ మతిన్ కుటుంబంలో గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువురూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన తమ్ముడు ఫాయాజ్ కత్తితో అన్న మతిన్‌ గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన మతిన్​ను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మతిన్​కు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని కుటుంబసభ్యులు వెల్లడించారు.  ఈ ఘటనపై ఎలాంటి సమాచారం అందలేదని ఎస్సై ఆంజనేయులు సోమవారం ఉదయం తెలిపారు.