Breaking- దారుణం..టాయిలెట్‌లో మృతశిశువు కలకలం

0
83

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. విశాఖ KGHలో ప్రసూతి విభాగ మరుగుదొడ్డిలో మృతశిశువు లభ్యం అవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. గైనిక్ వార్డులో దుర్వాసన రావడంతో సిబ్బంది పరిశీలించినట్లు తెలుస్తుండగా..ఆ శిశువు పూర్తిగా బట్టలతో కప్పేసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతశిశువును పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించి..మృత శిశువు ఎవరని వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు.  దీనిపై వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.