దారుణం..హనుమకొండలో గర్భిణీ ఆత్మహత్య..భర్త వేధింపులే కారణమా?

0
80

తెలంగాణ: హనుమకొండ జిల్లాలోని భీమారం బ్యాంక్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణీగా  ఉన్న బ్యాంక్ మేనేజర్ అనూష ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. గత కొంతకాలంగా అనూషను వరకట్న వేధింపులతో భర్త ప్రవీణ్ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో అనూషను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నాడని అనూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అనూష మృతదేహం ముందు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనితో కేయూ పోలీసు స్టేషన్ ఎదుట కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. అనూష భర్త ప్రవీణ్ ను కేయూ పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.