నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుముల మండలంలోని తెట్టేకుంటగ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు, సంధ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దీనితో తీవ్ర మనస్థాపం చెందిన ఆరు రెండు రోజుల క్రితం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికుల మృతితో తెట్టెకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.