గ్రామస్తులు ఆ రూమ్ తలుపులు తీయకపోతే దారుణం జరిగేది – క్షుద్రపూజల పేరుతో ఏం చేస్తున్నారంటే

Atrocities would have taken place if the villagers had not opened the doors of that room

0
88

సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డవలప్ అయింది. అయినా కొంతమంది మాత్రం ఇంకా ఈ బ్లాక్ మ్యాజిక్ ఈ తంత్ర విద్యలు, క్షుద్రపూజలు, బాణామతి చేతబడి వీటిని నమ్ముతూ ఉంటారు. వీటి కోసం ఏకంగా నరబలి ఇస్తున్నారు ఇలాంటి వారు చీకట్లో అమావాస్య రోజుల్లో రెచ్చిపోతున్నారు. తమిళనాడులో జరిగిన ఓ క్షుద్రపూజల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అక్కడ జనం కొంచెం ఆలస్యం చేసినా బిడ్డ ప్రాణం పోయేది.

తమిళనాడులోని రాణిపేట, అరకోణంలో ఆశీర్వాదం అనే వ్యక్తి అక్కడ నుంచి వేరే ఊరిలో ఉంటున్నాడు. అయితే అతను అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ ఉండేవాడు. గుప్త నిధులపై ఆశ పెట్టుకున్నాడు. ఎక్కడ ఉన్నాయా అని ఊర్లన్ని తిరిగేవాడు. ప్రతీ అమావాస్యకు ఊళ్లోని తన సొంత ఇంటికి వచ్చేవాడు ఇంటిలో ఏవేవో పూజలు చేసి మళ్లీ తెల్ల‌వారే సరికి వెళ్లిపోయేవాడు.

అతనిపై గ్రామస్తులకి అనుమానం వచ్చింది. మొన్న అర్థరాత్రి టైమ్ లో ఓ పాపను కారులో తీసుకొచ్చాడు. ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. అంతేకాదు అతనితో మరో ఇద్దరు మాంత్రికులు ఉన్నారు వారిని కర్నాటక నుంచి తీసుకువచ్చాడు. వెంటనే స్ధానికులు అక్కడ తలుపులు తీసి లోపలికి వెళ్లారు పాపని బలి ఇవ్వడానికి సిద్దమయ్యారనేది స్ప‌ష్టంగా కనిపించింది. వెంటనే వారిని అక్కడ నిర్భందించి పోలీసులకి అప్పగించారు. కొంచెం ఆలస్యం అయి ఉంటే ఆ పాప చనిపోయేది.