ఘోరం..4వ తరగతి బాలికపై వృద్ధుడి ఘాతుకం

0
98

రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. పాపం తెలియని పసివాళ్ళు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలపై కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఏపీలో దారుణం జరిగింది.

గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కుమార్తెతో పాటు బాలిక 4వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో జ్వరం, ఒళ్లు నొప్పులతో బాలిక బాధపడుతుండటంతో వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో నోరు విప్పిన బాలిక తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎన్ని కఠిన శిక్షలు వేసిన మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. వీరి అకృత్యాలకు అభం శుభం తెలియని అభలలు బలి అవుతున్నాయి. దీనితో పసి వయసులోనే కానరాని లోకాలకు వెళ్తున్నారు. కొంతమంది పరువు పోతుందని ఇలాంటి ఘటనలు బయటపడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. సమాజంలో ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతున్న కొన్నే వెలుగులోకి రావడం గమనార్హం.