ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కళ్ళ ముందే భర్త ఓ మహిళపై లైంగిక దాడి చేయడాన్ని అడ్డుకోవాల్సి పోయి… ఆ వీడియోను తీసి ఓ భార్య అరాచకానికి తెర లేపింది. ఈ సంఘటన విజయవాడలో జరిగింది.
విజయవాడకు చెందిన ఓ వివాహిత భర్త కేటరింగ్ పని చేస్తూ ఉంటాడు. ఈ నెల 3వ తేదీన రాత్రి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. వివాహిత నోరు మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై భర్త రెండుసార్లు లైంగిక దాడి చేయగా… ఆ దుర్మార్గాన్ని అతడి భార్య వీడియో, ఫోటోలు కూడా తీసింది. ఆ తర్వాత రోజు కూడా ఆమెను బెదిరించి లైంగిక దాడి చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ పిల్లలిద్దరినీ చంపేస్తామని బెదిరించారు.