హైదరాబాద్ లో దారుణం..బర్త్ డే రోజే యువతిపై అఘాయిత్యం

0
89

రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారాయి. ఇక తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బ్యూటిషన్ పై ఆమె స్నేహితుడే పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో  బుధవారం ఆ యువతి పుట్టిన రోజు కావడంతో ఇంటికి వెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.