నల్గొండలో దారుణం..డాక్టర్ అవతారమెత్తిన నర్సులు- గర్భిణిపై ప్రయోగం..చివరకు..

0
97

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నర్సులే డాక్టర్ల అవతారమెత్తి ప్రసవం కోసం వచ్చిన గర్భిణీపై ప్రయోగం చేశారు. గర్భిణికి నర్సులు నార్మల్ డెలివరీ చేయించగా..శిశువు పరిస్థితి విషమంగా మారింది. దీనితో హుటాహుటీన హైదేరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి సిబ్బంది తరలించారు. శిశువు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. శిశువు మృతికి దేవరకొండ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది కారణం అని వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళన చేపట్టారు.