దేశంలో రోజురోజుకు అత్యాచారాల సంఖ్య పెరిగిపోతుంది. వావి వరసలు, చిన్న పెద్ద అని మరిచిన కామాంధుల అఘాయిత్యాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. ఇక తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ లో దారుణం చోటు చేసుకుంది. పదేళ్ల బాలికపై తండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.