ఆమె భర్త చిరు కాంట్రాక్టర్ ఆమె ఓ చిన్న ఉద్యోగం చేస్తోంది .ఇటీవల భర్త ఆమెని పెద్దగా పట్టించుకోవడం లేదు దీంతో ఓ డిగ్రీ స్టూడెంట్ తో ఆమె అఫైర్ పెట్టుకుంది. భర్త లేని సమయంలో ఇంటికి అతను వచ్చేవాడు. ఇలా కొంతకాలం వీరి అఫైర్ నడిచింది. భర్తలో మార్పు వస్తుంది అనుకుంది. కాని భర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆ స్టూడెంట్ తో కలిసి వెళ్లిపోవాలి అని ప్లాన్ వేసింది.
చివరకు ఈ విషయం అతనికి చెప్పింది. అతను కూడా తన స్నేహితుల హెల్ప్ తీసుకున్నాడు. అయితే వీరు ఓ కార్ రెంట్ కి తీసుకున్నారు. ఈ కార్ లో రాత్రి 11 గంటలకు ప్రియుడితో కిలసి ఆమె పారిపోవడానికి సిద్దం అయింది. అయితే ఈ మధ్యలోనే ఆమె భర్త వచ్చి వారిని పట్టుకున్నాడు. ఇంతకీ వీరి గురించి ఆమె భర్తకి ఎలా తెలిసింది అంటే?
ఈ కారు డ్రైవర్ ఆ కాంట్రాక్టర్ కి బాగా తెలిసిన వ్యక్తి. ఇలా ఓ స్టూడెంట్ తో మీ భార్య వెళుతుంది అని మెసేజ్ పెట్టాడు. అతను తన బంధువులని తీసుకుని మంగూరు చెక్ పోస్టు దగ్గర వీరి కారును ఆపారు. చివరకు ఆ పిల్లాడి తల్లి దండ్రులు ఆ యువకుడ్ని తీసుకువెళ్లారు. భార్య చేసిన పనిని బంధువుల ముందు పెట్టి విడాకులకి అప్లై చేసుకున్నాడు భర్త.