ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీరి కామానికి ముక్కుపచ్చలారని చిన్నారులు బలి అవుతున్నారు. ఇలా రోజు ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది.
తాజాగా మూడేళ్ల చిన్నారిపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పెద్దతండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పెద్దతండాకు చెందిన మూడేళ్ల బాలిక ఇంట్లో ఆడుకుంటూ ఉండగా వరుసకు బాబాయ్ అయిన నవీన్ ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆసుపత్రికి తీసుకెళ్తే అసలు విషయం బయట పడింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఎప్పటికి తాగుతాడని, గంజాయి అలవాటు ఉందని స్థానికులు తెలిపారు.