Flash news: డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడ్డ బడా రియల్టర్

0
123

అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మాదకద్రవ్యాల కేసులో టోనీ సహా 10 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. టోనీ సహా 10 మందికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అయితే ఈ డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన టోనీ 15 రోజులకు ఒకసారి ముంబై బ్యాచ్ నీ హైదరాబాద్ పంపిస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాదులోని ఓయో రూమ్ లో మకాం వేసి వ్యాపారవేత్తలకు డ్రగ్స్ అమ్ముతున్నాడు. టోనీకి నమ్మకం ఉన్నా 60 మంది యువకుల చేత కూడా ఈ డ్రగ్స్ వ్యాపారం చేయిస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాల నుంచి టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్ చేసుకుంటున్న వ్యాపారవేత్తలు.

నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద మొత్తంలో వ్యాపారవేత్త నిరంజన్ జైన్ డ్రగ్స్ వాడుతున్నాడు. 30 సార్లు టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్ తేప్పించుకున్న నిరంజన్ జైన్. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. అంతేకాదు పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనులను కాంట్రాక్టు తీసుకున్న నిరంజన్. పాత బస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండి అరెస్ట్. మసాలా దినుసులతో ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆనంద్. అలాగే ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్ అరెస్టు అయ్యాడు.

హైదరాబాదుతో పాటు ఆంధ్రాలో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్న శాశవత్ జైన్, ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి, నిరంజన్ జైన్, ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ అరెస్ట్. ప్రముఖ export and import వ్యాపారి వెంకట్ చలసాని అరెస్ట్ అయ్యారు. ఆంధ్ర తెలంగాణలో ప్రముఖ ఎక్స్పోర్ట్ గా కొనసాగుతున్న చలసాని వెంకట్, భార్గవ్ , వెంకట్ లు కలిసి పార్టనర్స్ గా ఎక్స్పోర్ట్ వ్యాపారం, వ్యాపారవేత్త తమ్మినేద సాగర్ ను అరెస్ట్ చేశారు. వీరందరికి ముంబై డ్రగ్ మాఫియా డాన్ టోనీతో వ్యాపారవేత్తలకు సంబంధాలు ఉన్నాయి.