బ్యాంకు సిబ్బంది నిర్వాకం..రాత్రంతా లాకర్‌ గదిలోనే వృద్ధుడు

0
84

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్వాకం బయటపడింది. బ్యాంకుకు వచ్చిన ఓ వృద్ధున్ని రాత్రంతా లోపలే ఉంచి తాళం వేశారు సిబ్బంది. బ్యాంకు లాకర్ కోసం కృష్ణారెడ్డి సోమవారం బ్యాంకుకు వెళ్లారు. బ్యాంక్‌ లాకర్ గదిలోకి వెళ్లిన వృద్ధుడు కృష్ణారెడ్డిని గమనించని సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. చీకటిపడిన ఇంటికి రాకపోవడంతో కృష్ణ కుటుంబీకులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్​ నుంచి బయటకు తెచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు.