ఏదైనా పర్యాటక ప్రాంతం ఉంది అంటే అక్కడకు వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇక ద్వీప ప్రాంతం అయితే ముందు వెళతాం అంటారు. కాని ఇక్కడ పోవెగ్లియా ద్వీపానికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. అంతేకాదు ప్రభుత్వం కూడా నో చెబుతుంది. నీటిపై తేలియాడే అందమైన నగరం వెనీస్ ఇటలీలో ఉంది. ఈ నగరానికి 16 కి.మీ దూరంలో ఓ అందమైన దీవి ఉంది అదే పోవెగ్లియా. ఇంతకీ ఎందుకు ప్రజలు ఇక్కడకు వెళ్లేందుకు భయపడుతున్నారు అంటే దీనికి ఓ కారణం ఉంది.
పోవెగ్లియా దీవిని ఇటలీ ప్రజలు ఓ శవాల దిబ్బగా చెబుతారు ఎందుకు అంటే 16 వశతాబ్దంలో ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చింది. ఈ సమయంలో ఇటలీలో వేలాది మంది ప్లేగు వ్యాధి బారిన పడ్డారు. దీంతో శవాలను వ్యాధి గ్రస్తులను పోవెగ్లియాలో వదిలేసింది అప్పటి ప్రభుత్వం. అక్కడ అలాగే ప్రజలు నివశించారు తిండి నీరు లేక చనిపోయారు.
చివరకు అక్కడ ప్రజలు ఎవరూ ఉండలేదు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఇక్కడ ప్రజలు ఎవరూ వెళ్లేందుకు సాహసించరు. కొంత మంది పర్యాటకులు వెళ్లినా తిరిగి రాలేదు అనే వార్తలు ఆనాడు వినిపించేవి. దీంతో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ దీవిని, లుగీ బ్రుగనరో అనే వ్యాపారవేత్త వేలం ద్వారా 7.04 లక్షల డాలర్లు పెట్టి 99 ఏళ్లకు లీజు తీసుకున్నారు. పర్యాటక ప్రాంతంగా డవలప్ చేద్దాం అని చూస్తున్నారట.