నమ్మించి నట్టేట ముంచి..కోటి రూపాయలతో కుటుంబం ఉడాయింపు

0
76

ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా ఉంటూ నమ్మించి నట్టేట ముంచారు. ఏకంగా కోటి రూపాయలతో కుటుంబం ఉడాయించిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన సుధాకర్ అంజలి ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా వుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎంతో నమ్మకంగా ఉంటూ అందినకాడికి అప్పులు చేసి కోటి రూపాయలతో పరారీ అయ్యారు. దీనితో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.