Bengaluru CEO | నాలుగేళ్ల కొడుకుని హత్య చేసి, బ్యాగ్ లో కుక్కి.. ఓ కంపెనీ CEO దారుణం

-

Bengaluru CEO | మాతృత్వపు మమకారాన్ని మరిచి కన్న కొడుకుని హతమార్చింది ఓ కసాయి తల్లి. నాలుగేళ్ల కొడుకుని ఎలాగైనా వదిలించుకోవాలని ఏ తల్లీ చేయలేని దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్రణాళికతో పసివాడి ప్రాణం తీసింది. అనంతరం లగేజ్ బ్యాగ్ లో చిన్నారి డెడ్ బాడీని తరలిస్తూ పోలీసులకు ఆధారాలతో సహా పట్టుబడింది. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టింది ఉన్నత చదువులు చదివి, సొంతగా స్టార్ట్ అప్ రన్ చేస్తోన్న మహిళ కావడం గమనార్హం. ఈ విషయం తెలిసిన పోలీసులు కూడా ఆమె చేసిన దుర్మార్గపు చర్యకు ఖంగు తిన్నారు. కాగా ఈ కేసుకి సంబంధించి మీడియా సమావేశంలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. సుచనా సేత్(Suchana Seth), బెంగళూరుకు చెందిన మైండ్ ఫుల్ AI ల్యాబ్ కంపెనీ సీఈఓ(Bengaluru CEO). వివాదాల కారణంగా భర్తతో విడిపోయి కొడుకుతో కలిసి విడిగా నివశిస్తోంది. ఆమె ఈ నెల 6న కొడుకుతో కలిసి గోవా వెళ్ళింది. నార్త్ కాండోలిమ్ లోని ఓ హోటల్ లో రూమ్ బుక్ చేసుకుని, కొడుకుతో కలిసి ఉంది. 8వ తేదీ హోటల్ రిసెప్షన్ సిబ్బందికి ఫోన్ చేసి, తాను బెంగుళూరు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేయమని కోరింది. ఇక్కడ నుండి బెంగుళూరుకు క్యాబ్ ఎక్కువ ఛార్జ్ పడుతుందని.. దానికంటే ఫ్లైట్ టికెట్ తక్కువ కాస్ట్, తక్కువ సమయంలో రీచ్ అవ్వొచని రిసెప్షన్ సిబ్బంది సూచించారు. అందుకు నిరాకరించిన సూచనా.. క్యాబ్ బుక్ చేయాలని ఒత్తిడి చేసింది. దీంతో ఆమె కోరినట్టు క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ రాగానే లగేజ్ తీసుకుని సుచనా రూమ్ వెకేట్ చేసింది.

అనంతరం వారు స్టే చేసిన రూమ్ క్లీన్ చేయడానికి వెళ్లిన హౌస్ కీపింగ్ సిబ్బంది రక్తపు మరకలను గమనించారు. విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. వచ్చేటప్పుడు కొడుకుతో వచ్చిన సుచనా.. వెళ్ళేటప్పుడు తనతో కొడుకు లేకపోవడం, రూమ్ లో రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చిన హోటల్ మేనేజ్మెంట్ గోవా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓవైపు సీసీ టీవీ పరిశీలిస్తూ, మరోవైపు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. సుచనా కి కాల్ చేయగా ఆమె అప్పటికే కర్ణాటకలోని చిత్రదుర్గ్ వరకు చేరుకున్నట్టు తెలిపింది.

పోలీసులు రక్తపు మరకల గురించి ప్రశ్నించగా.. తనకి పీరియడ్స్ అని, ఆ రక్తపు మరకలని తెలిపింది. కుమారుడి గురించి ఆరా తీయగా.. సౌత్ గోవాలోని తన స్నేహితుడి ఇంట్లో విడిచిపెట్టానని చెప్పింది. ఆమె చెప్పిన అడ్రస్ లో విచారించిన పోలీసులకి అది ఫేక్ అడ్రస్ అని తేలింది. పోలీసులు క్యాబ్ డ్రైవర్ కి ఫోన్ చేసి.. ఆమెకి అనుమానం రాకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో క్యాబ్ డ్రైవర్ ఆమెను చిత్రదుర్గ్ పోలీస్ స్టేషన్ కి తరలించాడు. అక్కడ ఆమె బ్యాగ్ ని తనిఖీ చేయగా బాలుడి శవం బయటపడింది. రక్తపు మడుగులో ఉన్న బాలుడి మృతదేహాన్ని చూసిన పోలీసులు షాక్ కి గురయ్యారు.

కాగా, సుచనా భర్త జకర్తాలో ఉంటున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్యా విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రతివారం కొడుకుని తండ్రి వద్దకు తీసుకెళ్లాలనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అలా చేయడం ఇష్టం లేకపోవడంతోనే కొడుకుని మర్డర్ చేసి ఉండొచ్చు అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఆమె కొడుకుని హత్య చేయడానికి మోటివ్ ఏంటో మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా.. డేటా సైంటిస్ట్ అయిన సుచనా సేథ్ టెక్ కన్సల్టెన్సీ ‘ది మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్’ ఫౌండర్ & CEO అని పోలీసులు తెలిపారు. ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ ఎక్స్పర్ట్. ఆమెకి డేటా సైన్స్, స్టార్టప్ పరిశ్రమలో పనిచేసిన 12 సంవత్సరాల అనుభవం ఉంది. 100 మంది బ్రిలియంట్ ఉమెన్ AI ఎథిక్స్ జాబితాలో ఆమె ఒకరు. సుచనా మసాచుసెట్స్ లోని బోస్టన్ హార్వర్డ్ యూనవర్సిటీలో బెర్మాన్ క్లైన్ సెంటర్లో ఫెలో మెంబర్.

Read Also: భారత్ తో మాల్దీవుల వివాదం.. తీవ్రంగా స్పందించిన మాటి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....