ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు బిగ్ షాక్..!

Big shock to that real estate company

0
115

భూమి మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం అంటే కుదరదు. ప్రభుత్వం కొన్ని రూల్స్‌ పెట్టింది. చెట్లు నాటాలన్నా..నరకాలన్నా..పర్మిషన్లు తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బుద్ధి చెప్పింది అటవీ శాఖ.

వెస్ట్ సైడ్ వెంచర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో ఓ స్థలంలో ఉన్న 65 చెట్లను ఎటువంటి అనుమతులు లేకుండా తొలగించింది. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో తొలగించిన చెట్లను పరిశీలించి వాల్టా యాక్ట్ ప్రకారం రూ. 4 లక్షలు జరిమానా విధించారు.

అంతేకాదు తొలగించిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటి వాటిని కాపాడాలనే నిబంధన కూడా పెట్టారు. చెట్లు తొలగించి ఎంత పని చేసాం అని రియల్ ఎస్టేట్ సంస్థ వారు ముక్కున వేలేసుకుంటున్నారు.