ఇప్పుడిప్పుడే అమెరికా కరోనా నుంచి బయటపడుతోంది. ఇలాంటి వేళ అమెరికాలో పక్షులకి ఓ వింత జబ్బు ఇబ్బంది పెడుతోంది. రోడ్లపై చాలా చోట్ల పక్షులు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు కూడా భయపడుతున్నారు. ఎక్కడ చూసినా పక్షులు చనిపోయి కనిపిస్తున్నాయి. అమెరికాలో 9 స్టేల్స్ లో ఇది కనిపిస్తోంది. వైరస్ కారణంగా ఈ పక్షులు అంతుచిక్కని వ్యాధిబారినపడి మరణిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాషింగ్టన్ లో జంతుపరిరక్షణ అధికారులు దీనిపై పరిశోధన చేస్తున్నారు. అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో పక్షుల మరణాల కేసులు నమోదైనట్టు ప్రకటించారు. వ్యాధికి కారణాలు ఏంటి అన్నదానిపై పరిశోధనలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పక్షులని ఎవరూ పట్టుకోవడం లేదు, అంతేకదు వాటిని ముట్టుకుంటే వైరస్ సోకుతుంది అని భయపడుతున్నారు.
వైరస్ బారినపడ్డ పక్షి కనుగుడ్లు ఉబ్బి, పట్టుకొల్పోయి మరణిస్తున్నాయని, ఏప్రిల్ నెలలో వీటిని ముందు గుర్తించాము అని తెలిపారు. జూన్ నెలకి ఇలా వేలాది పక్షులు మరణించాయని తెలిపారు.