తమిళనాడు(Tamil Nadu) తిరుప్పూర్ జిల్లాలోని పల్లడంలో నలుగురి హత్య ఘటన సంచలనంగా మారింది. కల్లకినారుకు చెందిన బీజేపీ నేత మోహన్‌రాజ్ కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. మోహన్ రాజ్, సెంథిల్ కుమార్, అంబల్, పుష్పవతి అనే నలుగురిని కొడవలితో దాడి చేసి నరికి చంపేశారు. ఐతే సెంథిల్‌కుమార్ షాపులో పనిచేసిన మాజీ ఉద్యోగి వెంకటేష్..ఈ హత్యలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు.
సెంథిల్‌కుమార్ షాపులో పనిచేసే వెంకటేష్..కొన్నాళ్ల క్రితం అక్రమాలకు పాల్పడ్డాడు. అప్పట్లో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో..పగ పెంచుకున్న వెంకటేష్ సెంథిల్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. వారిని చంపేందుకు ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే అతన్ని రెచ్చగొట్టేందుకు సెంథిల్ ఇంటి దగ్గరే మద్యం సేవించడం మొదలుపెట్టారు. ఇదేమని ప్రశ్నించిన అతనిపై మూకుమ్మడిగా కొడవళ్లతో దాడికి దిగారు.
Tamil Nadu | దీంతో దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుటుంబసభ్యులను కూడా నరికి చంపారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సెంథిల్ కుమార్ కుటుంబాన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు స్థానికులు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.