షాద్ నగర్ లో సబితా ఇంద్రారెడ్డి సహా మరో మంత్రికి షాక్

0
114

తెలగాణ రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో నిరసనల షాక్ తగిలింది. ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరుతూ కొందుర్గు బిజేవైఎం ఆధ్వర్యంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకున్నారు.

షాద్ నగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు సబిత, ఎర్రబెల్లితో పాటు స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెవైఎం కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తూ వాహనాలకు అడ్డు తగిలారు. పోలీసులు రంగ వ్రవేశం చేసి బిజెవైఎం కార్యకర్తలను బలవంతంగా గుంజిపడేశారు. అనంతరం మంత్రులు వెళ్లిపోయారు.