Flash: గంగానదిలో పడవ బోల్తా..10 మంది గల్లంతు

0
94

సుమారు 55 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ గంగానదిలో బోల్తా పడింది. బీహార్‌లోని పట్నా సమీపంలోని దానాపూర్ వద్ద కూలి పనులు ముగించుకుని సొంతూర్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు పది మంది కనిపించకుండా పోయారని, మిగిలినవారు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు.