Flash- రైలులో బాంబు పేలుడు..సీఆర్​పీఎఫ్​ జవాన్లకు గాయాలు

Bomb blast on train injures CRPF personnel

0
73

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్​పీఎఫ్) ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలులో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సీఆర్​పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఝర్సుగూడ నుంచి జమ్ము తావి వెళ్తున్న రైలు ఉదయం 6.30 గంటలకు ప్లాట్‌ఫామ్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సహా..హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. వీరిని రాయ్‌పూర్‌లోని నారాయణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు..ఇగ్నిటర్ సెట్ బాక్స్ నేలపై పడడంతోనే ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.