వీడియో గేమ్ కి బానిసైన బాలుడు – తల్లికి ఊహించని షాక్ ఇచ్చాడు

Boy addicted to video game-Gave the mother an unexpected shock

0
96

ఈ రోజుల్లో మొబైల్ వీడియో గేమ్స్ పిల్లలపై ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. చాలా మంది పిల్లలు ఏకంగా తల్లిదండ్రుల వ్యాలెట్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, ఇక వారి మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూ నెట్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా నగదు పే చేస్తున్నారు. ఇలా లక్షలు పొగొట్టిన వారిని మనం చూశాం. ఢిల్లీలో ఓ సంఘటన వెలుగుచూసింది. ఫ్రీ ఫైర్ మొబైల్ గేమ్ ఆడటం కోసం ఓ 12 ఏళ్ల బాలుడు ఏకంగా ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు గత కొన్నాళ్లుగా మొబైల్ఫోన్లో ఫ్రీ ఫైర్ వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఇందులో ఆయుధాలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా కొనాల్సి ఉంటుంది. ముందు తండ్రి దగ్గర డబ్బులు కొట్టేసేవాడు. అయితే ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చింది. దీని కోసం ఏకంగా తల్లి హారాన్ని అమ్మేశాడు.

ఆ హారం 20 వేల రూపాయలకు అమ్మేశాడు. భయపడి ఇంటి నుంచి పారిపోయాడు. రైలు ఎక్కి ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ రైల్వేస్టేషన్లో దిగాడు. అక్కడ బాలుడిని గమనించిన ఓ ప్రయాణికుడు ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అతనిని రైల్వే పోలీసులు విచారిస్తే జరిగింది చెప్పాడు. చివరకు పేరెంట్స్ వచ్చి ఆ బాలుడ్ని తీసుకువెళ్లారు. ఈ కరోనా వేళ ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనిస్తే ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పారు ఆ బాలుడి పేరెంట్స్.