దేశంలో రోజురోజుకు మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు ముక్కుపచ్చలారని చిన్నారులను వదిలిపెట్టడం లేదు. తాజాగా ఈశాన్య దిల్లీలో ఘోరం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 12 ఏళ్ల బాలికను మాయమాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇందుకు మరో బాలుడు సహాయపడ్డాడు. బాలుడి చెర నుంచి బయటపడిన బాలిక.. ఇంటికి వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లితో చెప్పింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Flash- ఘోరం..12 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం!
Boy rapes 12-year-old girl!