Breaking News : రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ కు గాయాలు

Injuries to Kathi Maesh in road accident

0
115

సినీనటుడు, విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జిగింది. మహేష్ ప్రయాణిస్తున్న కారు లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేష్ కు గాయాలు అయ్యాయి. వెంటనే నెల్లూరులోని మెడికేర్ ఆసుపత్రికి తరలించారు.

 

ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కారు నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు తెలియాల్సి ఉంది.కత్తి మహేష్ ది సొంతూరు చిత్తూరు జిల్లా. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.