పానీపూరీలతో పెళ్లికూతురు నగలు – వీడియో చూడండి

bride jewellery with Panipuri

0
116

ఈ మధ్య పెళ్లిళ్ల సమయంలో కొన్నికొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డెకరేషన్లు, ఇక వధువు వరుడు పెళ్లి దండలు మార్చుకోవడం, వారికి బహుమతులు ఇవ్వడం. ఇలా అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ వీడియో కూడా వాటికి భిన్నంగా ఉంది. చూసిన ప్రతీ ఒక్కరు చాలా వెరైటీగా ఉంది అంటున్నారు.

నార్త్ ఇండియా నుంచి అడుగు పెట్టిన గోల్ గొప్పకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే . కర కరలాడే చిన్నపాటి పూరీలకు రంద్రం చేసి బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని తింటారు. ఓ పెళ్లికూతురు తనకు పానీపూరి మీద ఉన్న ప్రేమను స్పెషల్ గా తెలియజేసింది. పెళ్లి కూతురు పెళ్లి మండపంలో పూలదండలకు బదులు పానీ పూరికి ఉపయోగించే చిన్న చిన్న పూరీలను నగలుగా మార్చుకుంది..

ఇది చూసి అందరూ ముందు షాక్ అయ్యారు. కాని ఆమె అభిరుచిని చూసి ఐడియా బాగుంది అంటున్నారు.పెళ్లి దండలు, కిరీటం ఇవన్నీ అక్షయ అనే నవ వధువు తన పెళ్లి రోజున ఈ పానీపూరిలతో చేసిన నగలుగా ధరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CQGWMz1pGVR/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again